Sunrisers Hyderabad, on Friday, defeated Rajasthan Royals by five wickets to bag their first win of the ongoing Indian Premier League 2019. Rajasthan Royals posted a mammoth score of 198 runs in the first innings following a sensational century by Sanju Samson and a brilliant 70-run knock by Ajinkya Rahane. However, David Warner and Jonny Bairstow took SRH off to a flyer as they posted a quick-fire 100-run opening stand.Vijay Shankar played a blistering cameo towards the death while Yusuf Pathan and Rashid Khan played some scintillating strokes to hand SRH their first win of the campaign.
#sanjusamson
#ipl2019
#srhvsrr
#sunrisershyderabad
#rajasthanroyals
#davidwarner
#rashidkhan
#yusufpathan
#Ajinkyarahane
#Vijayshankar
ఐపీఎల్ 2019 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు బోణి కొట్టింది. రాజస్థాన్ రాయల్స్‌తో ఉప్పల్ స్టేడియంలో శుక్రవారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో డేవిడ్ వార్నర్ 69 పరుగులతో హాఫ్ సెంచరీతో రాణించడంతో 5 వికెట్ల తేడాతో సన్‌రైజర్స్ హైదరాబాద్ విజయాన్ని సాధించింది.
అంతకముందు టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ జట్టు 2 వికెట్ల నష్టానికి 198 పరుగులు చేసింది. అనంతరం చేధనలో వార్నర్‌తో పాటు జానీ బెయిర్‌స్టో , విజయ్ శంకర్ రాణించడంతో మరో 6 బంతులు మిగిలి ఉండగానే హైదరాబాద్ 5 వికెట్లు కోల్పోయి 201 పరుగులు చేసింది. బౌలింగ్‌లో 4 ఓవర్లలో 24 పరుగులిచ్చి కీలకమైన బట్లర్ వికెట్ పడగొట్టడంతో పాటు బ్యాటింగ్‌లోనూ కీలక సమయంలో వరుసగా 4, 6 బాదిన రషీద్ ఖాన్‌కి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.
ఇక రాజస్థాన్ రాయల్స్ బ్యాట్స్‌మెన్ సంజు శాంసన్ సెంచరీ నమోదు చేశాడు. ఓపెనర్ జోస్ బట్లర్ ఆరంభంలోనే పెవిలియన్‌కు చేరాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన సంజు శాంసన్.. మరో ఓపెనర్ అజింక్య రహానే తో కలిసి రెండో వికెట్‌కి 119 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు.